NTV Telugu Site icon

Donald Trump: 20 రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజ.. 113 ఎలక్టోరల్‌ సీట్లు సాధించిన కమలా హరీస్

Donald

Donald

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అధ్యక్ష క్యాండిడేట్ కమలా హ్యారిస్ మధ్య నెక్ టు నెక్ వార్ జరుగుతుంది. కౌంటింగ్‌ ఉత్కంఠగా సాగుతోన్న వేళ డొనాల్డ్ ట్రంప్‌ కీలక కామెంట్స్ చేశారు. పెన్సిల్వేనియాలో గెలిస్తేనే నాకు నిజమైన విజయమని తెలిపారు. పెన్సిల్వేనియా కౌంటింగ్‌లో అక్రమాలకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే.. సేకరించే వివరాలు ఇవే..

మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. కమలా హ్యారిస్ 10 స్టేట్లలో గెలిచింది. అయితే, ఇప్పటి వరకు ట్రంప్‌కు 210 ఎలక్టోరల్‌ సీట్లు సాధించగా.. కమలా హరీస్ 113 ఎలక్టోరల్‌ సీట్లు లభించాయి. ఇక, విజయంపై డొనాల్డ్‌ ట్రంప్‌, కమలాహారిస్‌ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉండటంతో అతడి కంపెనీల షేర్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. ట్రంప్ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్ ఈరోజు (బుధవారం) రెండు సార్లు నిలిచిపోయింది. దీంతో పాటు ట్రంప్ ఆధిక్యంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ లో జోష్ లోకి వచ్చింది. కొత్త రికార్డ్ సృష్టించిన బిట్ కాయిన్.. 75 వేల డాలర్ల మార్కును దాటేసింది. ఒక్కరోజే 10 శాతం లాభాల్లో బిట్ కాయిన్ నిలిచింది. క్రిప్టో్ కరెన్సీకి అనుకూలంగా ట్రంప్ ఉన్నారు.