Trump No Nobel Prize: నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈరోజు ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై అక్కసు వెళ్లగక్కారు. ఏం చేయకపోయినా ఒబామాకు ఇచ్చారు.. 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.
Read Also: Today Gold Rates: పసిడి ధరల పెరుగుదలకు బ్రేక్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు
అయితే, యూఎస్ అధినేత డొనాల్డ్ ట్రంప్ కి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రానట్టే.. తాను ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు ఆపానని, అవార్డు నాకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు తగ్గట్టే ఆయన్ను పలు దేశాలు (పాకిస్థాన్, ఇజ్రాయెల్, కాంబోడియా) నామినేట్ చేసేశాయి. కానీ ఈసారి ట్రంప్ కి నోబెల్ ఇచ్చే ప్రసక్తి లేనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీలోగా ఆయన్ను నామినేట్ చేయాల్సి ఉండగా, ఆ లోగా ఒక్క దరఖాస్తూ రాకపోవడమే దీనికి కారణం అని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాదికి ట్రంప్ ని నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.
