Donald Trump: తనకు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కిమ్‌తో చర్చలు జరిపారు. ఉత్తర కొరియాను మరోసారి ‘అణుశక్తి’ గా ట్రంప్ పేర్కొన్నారు. కిమ్‌తో సంబంధాలు తిరిగి స్థాపించుకునే ప్రణాళిక ఉందా..? అని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు.
Read Also: Janasena : పిఠాపురం జనసేన సభకు మూడు దారులు.. ఏ దారిలో ఎవరు వెళ్లాలంటే..?
‘‘ నాకు కిమ్ జోంగ్ ఉన్‌తో గొప్ప సంబంధం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ అతడు ఖచ్చితంగా న్యూక్లియర్ పవర్’’ అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. జనవరి 20న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా నార్త్ కొరియా ఒక అణుశక్తి అని చెప్పాడు. రష్యా, చైనా అణ్వాయుధాలను గురించి ప్రస్తావించిన సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మనం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించగలిగితే అది గొప్ప విజయం అవుతుంది, మన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. వాటి శక్తి చాలా ఎక్కువ’’ అని అన్నారు.
అణ్వాయుధాలను తగ్గించాల్సిన అవసరాన్ని ట్రంప్ చెప్పారు. నార్త్ కొరియా, ఇండియా, పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ఉత్తర కొరియా అణ్వాయుధాల విధానంలో ఏదైనా మార్పు సూచిస్తుందా.?? అని అడిగినప్పుడు, వైట్ హౌజ్ అధికారి మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో చేసినట్లు గానే ఉత్తర కొరియాను పూర్తిగా అణ్వాయుధ రహితంగా చేస్తారని చెప్పారు.