NTV Telugu Site icon

US Presidential Elections: అమెరికా అధ్యక్షుడుని గెలిపించేవి ఈ 7 స్వింగ్ స్టేట్స్.. ట్రంప్, కమలా హారిస్ మధ్య టైట్ ఫైట్..

Us Elections

Us Elections

US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నెల రోజులు మాత్రమే ఉంది. డెమెక్రాట్ల తరుపున ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. నవంబర్ 05న జరగబోయే ఎన్నికల్లో ఇరువురి మధ్య టైట్ ఫైట్ ఉన్నట్లు పోల్స్ తెలుపుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్‌లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది.

2024 అమెరికా ఎన్నికలకు సంబంధించి అరిజోనా, నెవెడా,విస్కాన్సిన్, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా రాష్ట్రాలు అధ్యక్షుడిని నిర్ణయించే స్వింగ్ రాష్ట్రాలుగా భావించబడుతాయి. ఈ రాష్ట్రాలే కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ కన్నా స్వల్ప ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్లు ఎమర్సన్ అండ్ ది హిల్ పోల్స్ పేర్కొన్నాయి.

Read Also: Kolkata: డాక్టర్ల సామూహిక రాజీనామాలు తిరస్కరణ.. వ్యక్తిగతంగా సమర్పించాలన్న ప్రభుత్వం

ముఖ్యంగా పెన్సిల్వేనియా ఈ ఏడు రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన స్వింగ్ రాష్ట్రంగా నిలుస్తుంది. పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినాలోని రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చింది. ఈ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌కి స్వల్ప ఆధిక్యం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్లో 49 శాతంతో ముందు ఉండగా, కమలా హారిస్ 48 శాతం ఆధిక్యంలో ఉన్నారు. నెవడాలో మాత్రమే హారిస్‌కి ఎడ్జ్ కనిపిస్తోంది. ట్రంప్‌కి 47 శాతం ఉండగా, కమలా హారిస్‌కి 48 శాతం మద్దతు ఉంది. మిచిగాన్, విస్కాన్సిన్ ఇద్దరూ 49 శాతం మద్దతు కలిగి ఉన్నారు. ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ సర్వే ప్రకారం.. హారిస్‌కి ఆసియన్లు, యూత్‌లో ప్రజాదరణ ఉండగా, మిగతా వర్గాలు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు.

మరో సర్వే కూడా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్న విషయాన్ని చెబుతోంది. ‘‘వాల్ స్ట్రీట్ జర్నల్’’ పోల్ ప్రకారం.. ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఆరింటిలో ఇద్దరు రెండు శాతం పాయింట్ల తేడాలో ఉన్నట్లు చెప్పింది. అరిజోనా, జార్జియా, మిచిగాన్ రాష్ట్రాల్లో కమలా హారిస్ ఆధిక్యంలో ఉండగా.. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెడాలో ట్రంప్ ముందున్నారు. పోల్ ప్రకారం.. ట్రంప్ నెవెడాలో 5 శాతం ఆధిక్యంలో ఉండగా.. మిగతా చోట్ల ఫలితాలు మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌గా ఉన్నాయి.