NTV Telugu Site icon

Trump Speech: 277 ఎలక్టోరల్ ఓట్లతో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్.. కాసేపట్లో స్పీచ్..!

Donald Trump

Donald Trump

Trump Speech: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖారారు అయింది. ప్రస్తుతం 277 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ లీడ్ లో దూసుకుపోతున్నారు. దీంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిశాక ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న తన మార్ ఎ లాగో నివాసానికి వెళ్లారు. అక్కడే తన మద్దతుదారులకు వాచ్ పార్టీ ఇస్తూ ఫలితాల సరళిని పరిశీలిస్తున్నారు. స్వింగ్ స్టేట్స్ సహా అన్ని చోట్ల తనకు అనుకూలంగా రిజల్ట్స్ వస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్టీకి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో పాటు పలువురు ప్రముఖులు వచ్చారు. మరికాసేపట్లో దేశవ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడనున్నారు.

Read Also: Bhatti Vikramarka: మల్లు భట్టి విక్రమార్కను అభినందించిన ఐరన్, స్టీల్ అసోసియేషన్..

కాగా, ఈ ఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని భావించిన కమలా హ్యారిస్ మరోసారి తుది ఫలితాలతో డీలా పడ్డారు. విజయంపై పూర్తి ధీమాతో ముందస్తుగా ఏర్పాటు చేసిన స్పీచ్ ను ఆమె క్యాన్సిల్ చేసుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హ్యారిస్ మంగళవారం రాత్రి వాచ్ పార్టీ ఏర్పాటు చేయగా.. ఆమె మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి వచ్చారు. కానీ, కమలా హ్యారిస్ వెనుకంజలో ఉండడంతో హరీస్ మద్దతుదారులు కన్నీళ్లతో ఇళ్లకు వెళ్లిపోయారు. హోవార్డ్ విశ్వ విద్యాలయం నుంచి కమల సపోర్టర్స్ విచారంగా బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమలా హరీస్ ఇప్పటి వరకు 226 ఎలక్టోరల్ సీట్లను దక్కించుకుంది.

Read Also: BSNL 5G: అప్పటి నుంచే జియో, ఎయిర్‌టెల్‌లకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ 5G సేవలు?

అయితే, మరోవైపు అమెరికాకు చెందిన ఓ జాతీయ ఛానల్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు కథనాలు ప్రచురించింది. ఇందులో కమలా హారిస్‌ను ఓడించి, ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారని తెలిపారు. అలాగే, యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించారని చెప్పుకొచ్చింది.