Site icon NTV Telugu

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఎఫ్ బీ ఐ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం

Donals Trump

Donals Trump

Donald Trump  Florida House Raided By FBI: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రింప్ ఇంటిలో ఎఫ్ బీ ఐ సోమవారం సోదాలు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న ట్రంప్ ఇళ్లు మార్-ఏ- లాగోలో ఎఫ్ బీ ఐ ఏజెంట్లు దాడులు చేశారు. అయితే ఈ చర్యను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ల దాడిగా తన సొంత సోషల్ మీడియా ట్రూట్ సోషల్ లో పోస్ట్ చేశాడు. అయితే ఎఫ్ బీ ఐ ఈ దాడులు ఎందుకు చేస్తుందనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు.  ఈ దాడులపై వ్యాఖ్యానించడానికి జస్టిస్ డిపార్ట్మెంట్, ఎఫ్ బీ ఐ ఏజెంట్లు నిరాకరించారు. అయితే ట్రంప్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొన్ని అధ్యక్ష రికార్డు పత్రాల గురించి సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Read Also: Heavy Rainfall in Telangana: 24 గంటల్లో తీవ్ర వాయుగుండం.. నేడు భారీ వర్షాలు

గతంలో ఫిబ్రవరిలో ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి 15 బాక్సు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కీలకమై పత్రాలు, మెమోంటోలు, మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా మధ్య జరిగిన ప్రత్యుత్తరాలు కూడా ఉన్నాయి. గతంలో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ పై దాడి చేయడంతో పాటు.. ఎన్నికలను ఫలితాలను తారుమారు చేయాలని ప్రయత్నించారనే అభియోగాలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు.  ఈ ఘటనలపై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష బరిలో ఉంటానని.. ట్రంప్ చెబుతున్నాడు.

 

 

 

Exit mobile version