Site icon NTV Telugu

Donald Trump: ఇరాన్లో పాలన మార్పు రావాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Trump

Trump

Donald Trump: ఇరాన్ లో నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్‌గా మార్చాలని తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో ట్రంప్ ఓ పోస్టు చేశారు. తాము చేపట్టిన దాడిలో ఇరాన్ దేశంలోని అణు కేంద్రాలకు భారీ నష్టం కలిగిందని వెల్లడించారు. ఇరాన్ అణు కేంద్రాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసినట్లు వెల్లడించారు. అమెరికా సైనికులు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు.

Read Also: AP Governance: సుపరిపాలనలో తొలి అడుగు.. నేడు ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం..!

మరోవైపు, ఇరాన్‌ అణు కేంద్రాలపై జరిగిన బాంబు దాడులతో టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే, సౌదీ అరేబియా, తుర్కియేల్లో ఉన్న అమెరికన్లు భద్రతపరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని యూఎస్ విదేశాంగ శాఖ కోరింది. ఇక, ఇజ్రాయెల్- ఇరాన్‌ తదితర దేశాల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో అమెరికన్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.

Exit mobile version