Donald Trump: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ లోని అక్రమ వలసదారులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష విధిస్తానంటూ హెచ్చరించారు. కొలరాడోలోని ఆరోరాలో నిర్వహించిన ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు.
Read Also: Bangladesh Durga Puja: బంగ్లాదేశ్లో దుర్గాపూజ వేడుకల్లో హింస.. పెట్రోల్ బాంబులతో దాడి
కాగా, మన దేశాన్ని ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ ను ఆక్రమిత అమెరికా అని పిలుస్తున్నారు.. నేను అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత వలసదారులే లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ అరోరాను స్టార్ట్ చేస్తాను.. దీంతో నవంబరు 5న అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుందని ఆయన తెలిపారు. అమెరికన్ పౌరుడిని, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసదారులకు ఉరిశిక్ష విధిస్తానను చెప్పుకొచ్చారు. వెనెజువెలా గ్యాంగ్ ట్రెన్ డె అరగువా సభ్యులు అనేక శిథిలావస్థలో ఉన్న అరోరా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను నియంత్రిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
Read Also: Derailment of Bagmati Express: తమిళనాడులో ట్రైన్ యాక్సిడెంట్.. 18 రైళ్లు రద్దు
ఇక, వెనెజువెలా గ్యాంగ్ ట్రెన్ డె అరగువా సభ్యులను ఏరిపారేయడానికి ఆరోరాపై ప్రత్యేక దృష్టిసారిస్తాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అరోరాను, దాడి చేసి స్వాధీనం చేసుకున్న ప్రతీ పట్టణాన్ని నేను రక్షిస్తా.. ఈ క్రూరమైన నేరస్థులను జైలులో పెట్టి.. వారిని దేశం నుంచి తరిమేస్తామని వ్యాఖ్యానించారు. ఇక, యూఎస్ ప్రభుత్వం దక్షిణ సరిహద్దు నియంత్రణకు మెక్సికోతో చాలా ఏళ్లుగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో వలసదారుల చొరబాటు పెరిగిపోతుందని డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.