NTV Telugu Site icon

Love Propose: అమ్మాయిలు ఎన్ని రోజుల్లో ఐ లవ్‌ యూ చెబుతారో తెలుసా?

Love Propose

Love Propose

Love Propose: అమ్మాయి, అబ్బాయిలు ఒరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారాలు వయస్సుతో సంబంధం లేకుండా సాగుతున్నాయి. ప్రస్తుత కాలంలో స్కూల్ స్థాయి నుంచే ప్రమలు చిగురిస్తున్నాయి. అయితే అబ్బాయి.. అమ్మాయికి ప్రేమను వ్యక్తం చేస్తే.. చాలా తక్కువ సందర్భాల్లో అమ్మాయిలు .. అబ్బాయిలకు ప్రేమను వ్యక్తం చేస్తారు. అయితే ఈ ప్రేమను వ్యక్తం చేయడానికి కూడా అబ్బాయిలు అయినా.. అమ్మాయిలు అయినా సమయం తీసుకుంటారు. అయతే ఇందులో ప్రేమను వ్యక్తం చేయడానికి అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ రోజులు సమయం తీసుకుంటారంటా? అదేంటీ అలా ఎలా తెలుస్తుందని అనుకుంటున్నారా? అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారని సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ సమయం తీసుకుంటారని తేలింది. సర్వేలో ఏముందంటే.. ఒక గర్ల్‌ఫ్రెండ్‌ తనబాయ్‌ ఫ్రెండ్‌కు ఐ లవ్‌ యూ చెప్పడానికి ఎన్నిరోజులు పడుతుందనే అంశంపై శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడు దేశాలకు చెందిన యువకుల నుంచి సమాధానాలు సేకరించిన పరిశోధకులు.. పలు విస్తుపోయే వివరాలను వెల్లడించారు. ఎవరైనా యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఐ లవ్‌ యూ చెప్పేందుకు 122 రోజుల సమయం తీసుకుంటుందని పరిశోధకులు తెలిపారు. యువకులు తమ ప్రేమను అంతకంటే తక్కువ రోజుల్లోనే వ్యక్తం చేస్తారని ప్రకటించారు.

Read also: Pawan Kalyan : మగవాళ్లు భయపడినా.. మహిళలు భయపడకూడదు

స్కాట్‌ల్యాండ్‌కు చెందిన ఎబర్ట్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు సర్వేను నిర్వహించారు. ది బ్రిటీష్‌ సైకలాజికల్‌ సొసైటీ ద్వారా వెలువడిన ఈ రిపోర్టులో విభిన్న సంస్కృతులు కలిగిన పలుదేశాల్లోని యువకుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, ఫ్రాన్స్‌,పోలాండ్‌,యూకేలకు చెందిన 3,109 మంది యువతీయువకులను సర్వేలో భాగంగా పరిశోధనలో భాగస్వాములను చేసింది. సర్వేలో 70 శాతం మంది యువతులు, 30 శాతం మంది యువకులు పాల్గొన్నారు. సర్వేలో కొన్ని ప్రశ్నలను ఉంచి, వాటికి సమాధానాలు తెలుసుకున్నారు. వారు వారి భాగస్వామికి ఎన్ని రోజులకు ఐ లవ్‌ యూ చెప్పారో తెలుసుకున్నారు. 60 శాతం యువకులు తమ గర్ల్‌ప్రెండ్‌కు 69 రోజుల తరువాత ఐ లవ్‌ యూ చెప్పారని సర్వేలో వెల్లడి కాగా.. యువతులతో పోలిస్తే యువకులు 15 రోజుల ముందుగానే తమ గర్ల్‌ఫ్రెండ్‌కు ఐ లవ్‌ యూ చెబుతుంటారని సర్వేలో స్పష్టమయింది. యువతులు ఐ లవ్‌యూ చెప్పేందుకు కనీసంగా 77 రోజులు తీసుకుంటారని, గరిష్టంగా 122 రోజల సమయం తీసుకుంటారని పరిశోధనలో వెల్లడైనట్టు శాస్ర్తవేత్తలు తెలిపారు.