Site icon NTV Telugu

భారత్‌కు చెక్‌ పెట్టేందుకు పాక్‌ తుగ్రిల్‌ !

బీజింగ్ ఎగుమతి చేసిన అతిపెద్ద అత్యంత అధునాతన యుద్ధనౌక (PNS తుగ్రిల్‌)ను చైనా సోమవారం పాకిస్తాన్ నేవీకి అందజేసినట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొ రేషన్ లిమిటెడ్ (CSSC)దీనిని రూపొందించింది. దీనికి టైప్ 054 A/P యుద్ధ నౌకకు PNS తుగ్రిల్ అని పేరు పెట్టారు.పాక్ నేవీ కోసం చైనా తయా రు చేస్తున్న నాలుగు టైప్ 054 యుద్ధనౌకలలో మొదటి హల్ PNS తుగ్రిల్ అని పాకిస్థాన్ నేవీ తెలిపింది.

తుగ్రిల్‌ సాంకేతికంగా అత్యాధు నికమైనది. లాంగ్‌రేంజ్‌, మిడ్‌రేంజ్‌, రాడార్లతోపాటు యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ మిస్సైల్స్‌, క్రూయిజ్‌ మిస్సైల్స్‌, ప్రయోగించే లాంఛర్లు సైతం దీనిలో ఉన్నాయి. అంతే కాకుండా నీటి అడుగున ఫైర్‌పవర్‌తో మెరుగుపరచబడిన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. టైప్ 054 తుగ్రిల్‌ చాలా తీవ్ర మైన బహుళ-ముప్పు వాతావరణంలో ఏకకాలంలో జరిగే నావికా పోరా ట మిషన్‌లను ఇది ఒకేసారి నిర్వహించే సామర్థ్యం కలిగి ఉందని పాకిస్తాన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. హిందూ మహా సముద్రంలో పాక్‌ ద్వారా భారత్‌కు చెక్‌ పెట్టాలని చైనా ఎప్పటి నుంచో అనుకుం టుంది. ఈ క్రమంలోనే తుగ్రిల్‌యుద్ధనౌకను డ్రాగన్‌, పాక్‌కు అప్పగించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version