Site icon NTV Telugu

జార్జ్‌ఫ్లాయిడ్ కేసులో కీల‌క తీర్పు.. ఆ అధికారికి 22 ఏళ్లు జైలు శిక్ష‌

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హ‌త్య ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  బ్లాక్ లైవ్ మ్యాట‌ర్ అనే ఉద్యమానికి దారి తీసింది.  వ‌ర్ణ వివ‌క్ష‌ను నిర‌సిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్ల‌మీద‌కు వ‌చ్చారు.  జార్జ్ ఫ్లాయిడ్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పోలీస్ అధికారుల‌ను ఇప్ప‌టికే ఉద్యోగాల నుంచి తొలగించారు.  కాగా వీరిపై కేసులు న‌మోదు చేయ‌డంతో కోర్టు విచార‌ణ జ‌రిపింది.

Read: కేంద్రంతో ట్విటర్‌ గేమ్‌ ఆడుతోందా ?

 జార్జ్ ఫ్లాయిడ్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పోలీసు అధికారి డెరిక్ చౌవిన్‌కు మినియాపోలీస్ కోర్టు 22.5 సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌ను విధించింది.  డెరిక్ స‌త్ప‌వ‌ర్త‌నతో ఉంటే 12 ఏళ్ల త‌రువాత పెరోల్ ఇవ్వొచ్చ‌ని కోర్టు పేర్కొన్న‌ది.  గ‌రిష్టంగా డెరిక్‌కు 12.5 సంవ‌త్సరాల జైలు శిక్ష‌ను విధించాల‌ని ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కోర్టుకు విన్న‌వించ‌గా, కోర్టు మాత్రం డెరిక్‌కు 22.5 సంవ‌త్సరాల జైలు శిక్ష‌ను విధించింది.  

Exit mobile version