ఉగ్రరూపం దాలుస్తున్న డెల్టా వేరియంట్… ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఆంక్షలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. అమెరికాలో ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సింహభాగం కేసులు డెల్టావేరియంట్ కేసులు ఉండటంతో ఆ దేశం అప్రమత్తం అయింది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్‌ను తప్పనిసరి చేశారు. మరోవైపు విజయవంతంగా ఒలింపిక్స్‌ను నిర్వహించిన జపాన్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో 12 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. రాత్రి సమయంలో 8 గంటల తరువాత బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, మాల్స్‌లో ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే సిడ్నీలో లాక్‌డౌన్ అమలులో ఉన్నది. ఈ లాక్‌డౌన్ ను మరోసారి పొడిగించారు. అటు న్యూసౌత్‌వేల్స్‌లో మరోసారి 600 లకు పైగా కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. గురువారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా కేసులు, 11 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.
Read: జైకోవ్ డి టీకాకు డీసీజీఐ అనుమతి…
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!