NTV Telugu Site icon

అమెరికాలో డెల్టా వేరియంట్‌ విజృంభణ..

అమెరికాలో రోజుకి సగటున నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరింది. 70 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కేసుల ఉద్ధృతి కలవరపెడుతోంది. ఇది దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జూన్‌ చివర్లో అమెరికాలో రోజుకి సగటున 11 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష దాటింది. అమెరికాలో గత నవంబర్‌లో రోజువారీ సగటు కేసులు లక్ష నమోదయ్యాయి. అప్పట్లో ఆ సంఖ్యను చేరడానికి ఆరు నెలలు పట్టింది. జనవరికల్లా 2.5 లక్షలకు చేరింది. జూన్‌లో కేసులు తగ్గినప్పటికీ ఆరు వారాల్లోపే మళ్లీ పెరిగాయి. రోజుకి సగటున నమోదయ్యే కేసులు లక్ష మార్కును దాటాయి.