Site icon NTV Telugu

Plane Crash: టొరంటోలో కూలిన విమానం.. 18 మందికి గాయాలు

Toranto

Toranto

Plane Crash: కెనడాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం నాడు టొరంటోలోని పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది. బలమైన గాలుల కారణంగా ఫ్లైట్ ల్యాండింగ్‌లో సమస్యలు ఏర్పడి ఏకంగా తలకిందులైపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది వరకు గాయపడగా.. ఇందులో మరో ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మిగతా 12 మందికి స్వల్ప గాయాలయ్యాయని పీల్ రీజినల్ పారామెడిక్స్ సర్వీసెస్ వెల్లడించింది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్‌ అంబులెన్స్‌లో తక్షణమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగినపుడు విమానంలో సుమారు 80 మంది ప్యాసింజర్లు ఉన్నారు. మిన్నియాపోలిస్‌ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురైందని పియర్సన్‌ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చేసిన ఒక పోస్టులో ఈ విషయాన్ని ధృవీకరించింది. ఫ్లైట్ తిరగబడి ఎయిర్‌పోర్టులో పడి ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

https://twitter.com/ErrolWebber/status/1891589945292198007

Exit mobile version