Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
- అమెరికా, చైనాలో కలవరం..
- వరసగా కనిపించకుండాపోతున్న కీలక సైంటిస్టులు..
- మిస్టరీ అదృశ్యాలు, మరణాల వెనక కుట్ర కోణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scientists disappear: అగ్రదేశాలు అమెరికా, చైనాలో వరసగా కీలకమైన సైంటిస్టులు మాయమవుతున్నారు. వరసగా జరుగుతున్న ఈ ఘటనలు ఆయా దేశాలను కలవరానికి గురిచేస్తున్నాయి. అణు సాంకేతికత, ఏఐ, హైపర్‌సోనిక్ ఆయుధాలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాలకు చెందినవారు హఠాత్తుగా మరణిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో ఇలాంటివి 11 సంఘటనలు నమోదయ్యాయి. చైనాలో 9 మంది సైంటిస్టులు మరణించారు. అయితే, ఈ సంఘటనలు చాలా వరకు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, వీటి వెనక ఏదైనా కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ఇటీవల అమెరికాలో నాసా ఇంజనీర్లు, ఎయిర్‌ఫోర్స్ జనరల్స్, లాస్ అలమోస్ వంటి అణు ప్రయోగశాల్లోని శాస్త్రవేత్తలు ఇలాంటి పరిస్థితులకే బలయ్యారు. మేజర్ జనరల్ విలియం నీల్ మెక్‌కాస్లాండ్ మిస్ అయ్యాడు. ఎయిర్‌ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్ కమాండర్‌గా పనిచేసే ఈయన, 2026 ఫిబ్రవరిలో వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆ తర్వాత అదృశ్యమయ్యారు. ఫోన్, కళ్లద్దాలు, స్మార్ట్ వాచ్ ఇంట్లో వదిలేసిన ఆయన, కేవలం ఒక రివాల్వర్ మాత్రమే తన వెంటన తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏమయ్యారనే విషయం తెలియలేదు.
ఇదే విధంగా నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన మోనికా రెజా కూడా అదృశ్యమైంది. కాలిఫోర్నియాలో స్నేహితులతో ట్రెక్కింగ్ చేస్తున్న ఆమె మిస్ అయ్యారు. స్నేహితుల కన్నా కాస్త దూరం వెనకబడిన ఆమె ఆచూకీ ఇంత వరకు లభించలేదు. సహాయక బృందాలు రోజులు తరబడి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా ఆమె జాడ కానరాలేదు. ఆమె రాకెట్లలో ఉపయోగించే సూపర్ అల్లాయ్‌లపై పరిశోధనలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..