NTV Telugu Site icon

DeepSeek: చైనాలో ప్రతీ ఇంట్లోకి దూరిపోతున్న ‘‘డీప్ సీక్’’..

Deep Seek

Deep Seek

DeepSeek:‘‘డీప్‌సీక్’’ చైనా ఏఐ మోడల్ ఇటీవల ప్రపంచ టెక్ రంగంలోనే సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో తోపుగా ఉన్న అమెరికాను ఒక్క దెబ్బతో వణికించింది. డీప్ సీక్ దెబ్బకు చాట్‌జీపీటీ వంటి దిగ్గజం కూడా ఆందోళన చెందింది. ప్రస్తుతం ఏఐ పరిశ్రమలో తిరుగులేకుండా ఉన్న అమెరికాకు చైనా ధీటుగా బదులిచ్చింది. చైనీస్ ఇంజనీర్ లింగ్ వెన్‌ఫెంగ్ 2023లో ఈ ఏఐ మోడల్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ఏఐతో పోలిస్తే ఈ చైనీస్ ఏఐ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీప్ సీక్ చైనాలోని అన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. చైనా ప్రజలు డీప్ సీక్‌ని ఆనందంగా స్వీకరిస్తున్నారు. టీవీలు, ఫ్రిజ్‌లు, రోబో వ్యాక్యూమ్ క్లినర్లలో డీప్ సీక్‌ని ఉపయోగిస్తున్నారు. అనేక హోమ్ అప్లికేషన్స్‌ బ్రాండ్స్ తమ ఉత్పత్తుల్లో డీప్ సీక్ కృత్రిమ మేథను ఉపయోగిస్తామని ప్రకటించారు.

Read Also: Gutha Sukender Reddy: కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా ఎస్‌ఎల్‌బీసీ అయిపోయేది!

డీప్ సీస్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ ని చైనా అధికారులు సత్కరించారు. ప్రస్తుతం కంపెనీ R1 రీజనింగ్ మోడల్‌కు కొనసాగింపుగా, R2 ను త్వరలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. గత రెండు వారాలుగా హైయర్, హిన్సెన్స్, TCL ఎలక్ట్రానిక్స్ వంటి గృహోపకరణ తయారీదారులతో పాటు హువావే, టెన్సెంట్ వంటి టెక్ దిగ్గజాలు డీప్ సీక్ మోడళ్లను ఉపయోగిస్తామని ప్రకటించాయి.

ప్రస్తుతం ఈ హోమ్ అప్లియెన్సెస్ చాలా వరకు వాయిస్-యాక్టివేడెట్ ఆదేశాలకు ప్రతిస్పందించే స్మార్ట్ పరికరాలుగా ఉన్నాయి. డీప్ సీక్ చేరికతో చాలా ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ డీప్ సీక్ ఆర్1 ఉపయోగించుకుని మరింత వేగంగా, అధునాతన అడ్డంకులను నివారించగలుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.