Deadly Radioactive Capsule Spurs Nationwide Search in Australia: అది ఒక చిన్న క్యాప్సుల్.. దాని పరిమాణం 6 మిల్లిమీటర్ల వ్యాసం, 8 మిల్లిమీటర్ల పొడవు మాత్రమే. కానీ, అది ఏకంగా ఆస్ట్రేలియా అధికారుల్నే హడలెత్తిస్తోంది. దాని కోసం 1400 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారంటే.. అది ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఆ చిన్న క్యాప్సుల్‌లో అంతటి ప్రమాదకరమైనది ఏముందనేగా మీ సందేహం? ‘సీజియం- 137’ అనే రేడియో ధార్మికత పదార్థం అందులో ఉంది. ఆ క్యాప్సుల్‌ని తాకినా, కనీసం దాన్ని దగ్గరగా ఉంచుకున్నా.. తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఒకవేళ దాన్ని తాకితే.. వెంటనే గాయాలు అవుతాయని, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. అందుకే.. అలాంటి వస్తువు ఏమైనా కనిపిస్తే, దానికి దూరంగా ఉండాల్సిందిగా వాళ్లు సూచిస్తున్నారు.
Himanta Biswa Sarma: మహిళలకు అసోం సీఎం సలహా.. ఎప్పుడు గర్భం దాల్చాలంటే..
ఇన్నాళ్లూ ఈ క్యాప్సుల్ పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమన్ ఉత్తర ప్రాంతంలోని ఒక సైట్‌లో ఉండేది. ఇటీవల దానన్ని ఆ సైట్ నుంచి పెర్త్‌కు రవాణా చేస్తుండగా.. మార్గమధ్యంలో పడిపోయింది. కానీ.. ఎక్కడ పడిపోయిందని తెలీదు. ఈ క్యాప్సుల్ పోయిందన్న విషయం తెలుసుకున్న అధికారులు.. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. సరిగ్గా ఎక్కడ పడిందో తెలీదు కాబట్టి.. దాన్ని ఏ సైట్ నుంచైతే తీసుకెళ్లారో, అక్కడి నుంచి పెర్త్ దాకా గాలిస్తున్నారు. అంటే.. ఓవరాల్‌గా 1400 కిలోమీటర్ల మేర వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఈ క్యాప్సుల్‌కి సంబంధించిన ఫోటోను విడుదల చేసి, ఎవరికైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు ప్రకటన విడుదల చేశారు. అది ఎవరికైనా చిక్కితే మాత్రం.. దాంతో ఆటలాడకుండా, వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని కూడా సూచించారు. దాన్నుంచి వెలువడే రేయేషన్స్ చాలా ప్రమాదం కాబట్టి, వాళ్లు అలా సూచనలు జారీ చేశారు. కాగా.. సీజియం- 137ను మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు.
Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..