NTV Telugu Site icon

Dalai Lama: చైనాకు తిరిగెళ్లే ప్రసక్తే లేదు.. భారత్‌లోనే ఉంటా

Dalai Lama

Dalai Lama

Dalai Lama Says He Will Not Return To China: తాను చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, ఇండియాలోనే ఉంటానని బౌద్ధ గురువు దలైలమా సోమవారం స్పష్టం చేశారు. భారత్‌ను అత్యుత్తమ దేశంగానూ అభివర్ణించిన ఆయన.. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కాంగ్రా’నే తన శాశ్వత నివాసమని పేర్కొన్నారు. తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రశ్నించగా.. ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ‘‘యూరప్, ఆఫ్రికా, ఆసియాలతో పాటు చైనాలోనూ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ నేను చైనాకు తిరిగి వెళ్లను. భారత్‌లోనే ఉంటాను, ఇదే ఉత్తమమైన దేశం, కాంగ్రా-పండిట్ నెహ్రూనే నా శాశ్వత నివాసం’’ అంటూ దలైలమా చెప్పుకొచ్చారు.

Taliban Militants: తాలిబన్ల అరాచకం.. పోలీస్ స్టేషన్‌ని నిర్బంధించి..

కాగా.. టిబెట్‌కు చెందిన 14వ దలైలమా 1959 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్నారు. 1951లో టిబెట్‌ను చైనా ఆక్రమించి, అప్పటి నుంచి పాలన కొనసాగించడం మొదలుపెట్టింది. వారి జాతీయ, సాంస్కృతిక గుర్తింపులను, సాంప్రదాయాలను నాశనం చేయడమే లక్ష్యంగా.. చైనా ఈ దురాక్రమణకు దిగింది. అయితే.. చైనా ప్రభుత్వాన్ని తిరిగి వెనక్కు పంపించేందుకు టిబెటన్లు తిరుగుబాటు చేశారు. కానీ.. ఇందులో వాళ్లు విజయం సాధించలేదు. అప్పుడు దలైలమా టిబెట్‌ని వదిలి, భారత్‌కి వచ్చేశారు. అలా ఆయన ఇక్కడే సెటిల్ అయిపోయారు.

Kabul Fuel Tanker Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోరం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి, 19 మంది దుర్మరణం

అటు.. లడాఖ్‌లోని గాల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాక.. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణ జరిగింది. చైనా బలగాలు సరిహద్దు దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు వాళ్లని అడ్డుకొని, తిరిగి వెనక్కు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఘర్షణ చోటు చేసుకోవడంతో.. ఇరు వర్గాల వారు గాయాలపాలయ్యారు.

Show comments