NTV Telugu Site icon

రోడ్డుపై కుప్పలుతెప్పలుగా డబ్బు కట్టలు.. ఎలా వచ్చాయంటే..?

Southern California

Southern California

ప్రపంచాన్ని మొత్తం ముందుండి నడిపిస్తోంది డబ్బు.. దానికోసం ఎన్నోతప్పులు చేస్తుంటారు.. ఇక ఆ డబ్బు ఫ్రీగా దొరికితే.. రోడ్డు మీద ఒక తుపాను కనిపిస్తేనే వదలని జనం.. డబ్బు కట్టలు దొరికితే వదులుతారా.. ఇదిగో ఇలా ఎగబడి మరీ నోట్లను ఏరుకోవడంలో ఎగబడ్డారు. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. దక్షిణ కాలిఫోర్నియాలోని కార్ల్స్‌బడ్‌లో ఓ ట్రక్కు రోడ్డుపై వెళ్తోంది. కొద్దిదూరం వెళ్లగానే ఆ ట్రక్కు డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకేముంది అందులో ఉన్న డబ్బు కట్టలు గాల్లో తేలాయి. దీంతో ప్రయాణికులందరూ షాక్ అయ్యి ఒక్కసారిగా తమ వాహనాలను నిలిపివేశారు. ఆ నోట్లు ఫేక్ కాదు అని నిర్దారించుకున్నాకా వాటిని ఏరుకోవడం మొదలు బెట్టారు. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌ అయింది.ఇక ఈ ఘటనపై పై అధికారులు మండిపడ్డారు. శాన్‌డిగో నుంచి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫీసుకు డబ్బు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, డబ్బు తీసుకున్న ప్రయాణికులందరు డబ్బును తిరిగి ఇవ్వాలని, లేకపోతె వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.