Curiosity Rover Makes A Stunning New Discovery: సౌరవ్యవస్థలో భూమి తరువాత మానవుడు నివసించే అవకాశాల ఉన్న గ్రహంగా అంగారకుడిని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పరిశోధనలు చేయడానికి నాసాతో పాటు మరికొన్ని దేశాల స్పేస్ ఏజెన్సీలు అరుణగ్రహంపై రోవర్లను పంపించాయి. వీటిలో గ్రహ ఉపరితలం, నీటి ఆనవాళ్ల గురించి పరిశోధనలు జరుపుతున్నాయి. ఇప్పటికే పలు అధ్యయనాలు మార్స్ పై ఒకప్పుడు విస్తారంగా నీరు ఉండేదని తేలింది. అయితే తాజాగా నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో అద్భుత ఆవిష్కరణ చేసింది. ఒకప్పుడు అంగారకుడిపై సరస్సులు ఉండేవనే ఆధారాలను కనుగొంది. క్యూరియాసిటీ అలల వంటి రాతి నమూనాలను కనుగొంది.
Read Also: Mallikarjun Kharge: దేశంలో వాక్ స్వాతంత్య్రం లేదు.. బీజేపీపై ఖర్గే మండిపాటు
ప్రస్తుతం క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై గేల్ బిలంలో ఉన్న మౌంట్ షార్ప్ ప్రాంతంలో ఉంది. ఇక్కడే మిలియన్ సంవత్సరా క్రితం సరస్సు ఉండేదని అందుకు అధారంగా కాలక్రమేణా సరస్సు మిగిల్చిన గ్రానైట్ ఆలల అల్లికలను కనుగొంది. నాసా దాదాపుగా దశాబ్ధం కింద క్యూరియాసిటీ రోవర్ ను పంపింది. రెండేళ్ల క్రితం పర్సువరెన్స్ అనే మరో రోవర్ ను విజయవంతంగా మార్స్ పైకి చేర్చింది నాసా.
ఒకప్పుడు నదులు, సముద్రాలతో అంగారక గ్రహం, భూమిని పోలి ఉండేది. ఇప్పటికే అక్కడ ధృవాల వద్ద గడ్డకట్టిన స్థితిలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే భూమితో పోలిస్తే అంగారకుడి పరిమాణం చిన్నగా ఉండటంతో పాటు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా నీరు అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడి అంతర్భాగంలో కోర్ కాలక్రమంలో మాగ్నిటిక్ ఫీల్డ్ ను జనరేట్ చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని సైంటిస్టులు భావిస్తున్నారు.