నేపాల్‌ను ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. అలాగే కర్ఫ్యూను కూడా కొనసాగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నాల్లో సహకరించాలని సైన్యం కోరింది.
కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం రణరంగంగా మారింది. సోమ, మంగళవారాల్లో జరిగిన విధ్వంసానికి నేపాల్ రాజధాని ఖాట్మండు అతలాకుతలం అయిపోయింది. ప్రభుత్వ భవనాలు, కార్లు, ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇక మాజీ ప్రధాని ఇంటికి నిప్పుపెట్డడంతో మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మీ చిత్రాకార్ సజీవ దహనం అయ్యారు. ఇక మంత్రులనైతే పరిగెత్తించి కొట్టారు.
ఇది కూడా చదవండి: Trump: ఖతార్‌లో ఇజ్రాయెల్ దాడులు.. తనకేమీ తెలిదన్న ట్రంప్
ఇక పరిస్థితులు చేదాటిపోవడంతో కేపీ శర్మ ఓలి(73) ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం సైన్యం పరిపాలనను అదుపులోకి తీసుకుంది. ఇక కేపీ శర్మ ఓలి ఎక్కడున్నారన్న సంగతి ఎవరికీ తెలియదు. దుబాయ్ పారిపోయారని చెబుతున్నా.. ఇంకా ఆచూకీ మాత్రం లభించలేదు.
ఇక కర్ఫ్యూ సెప్టెంబర్ 11, సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని సైన్యం వెల్లడించింది. ఇక దోపిడీ, అల్లర్లకు పాల్పడుతున్న 26 మందిని అరెస్ట్ చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఇక నిరసనల కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని పేర్కొంది. నిరసనల పేరుతో నేర కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. కొందరు లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారని వివరించింది. దయచేసి పౌరులంతా సహకరించాలని సైన్యం ఒక ప్రకటనలో కోరింది.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. హడలెత్తిస్తున్న ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇక జనరల్-జెడ్ ప్రతినిధిని నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ అర్ధరాత్రి కలిసి సంభాషించారు. సైనిక ప్రధాన కార్యాలయం జాంగి అడ్డాలో ఈ సమావేశం జరిగింది. జెన్-జెడ్ డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. ఇది ప్రాథమిక ప్రయత్నంగా సైన్యం తెలిపింది. ప్రధానంగా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని.. అలాగే ప్రతినిధుల సభను రద్దు చేయాలని జెన్ జెడ్ డిమాండ్ చేసింది.
ఇక నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్ సైన్యం అప్రమత్తం అయింది. ఇక భారతీయ పౌరుల కోసం సహాయం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది. సహాయం కోసం హెల్ప్‌లైన్లకు ఫోన్లు చేయాలని భారత్ కోరింది. ఇక నేపాల్ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని భారత్ తెలిపింది.
VIDEO | Kathmandu, Nepal: Visuals of the aftermath around the Nepali parliament which saw massive protests and clashes yesterday.
Violence continued on Tuesday in several parts of Nepal even after Prime Minister KP Sharma Oli's resignation, which appeared to have little effect… pic.twitter.com/Ep1hJ9D1AG
— Press Trust of India (@PTI_News) September 10, 2025
#WATCH | Nepal: Plumes of smoke continue to rise from the Nepali media outlet Kantipur media group’s headquarters, which was set on fire yesterday as the protest turned violent in Kathmandu.
The Nepali PM KP Sharma Oli resigned yesterday amid demonstrations against the… pic.twitter.com/F4LAb8M4lO
— ANI (@ANI) September 10, 2025
