థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కదులుతున్న ప్యాసింజర్ రైలుపై ఒక్కసారిగా భారీ క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో 22 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
బ్యాంకాక్‌కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌కు వెళ్తున్న రైలుపై క్రేన్ కూలిపోయింది. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది చనిపోగా.. 30 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు జరుగుతుండగా క్రేన్ కూలిపోయింది.
