Site icon NTV Telugu

ఒమిక్రాన్‌పై యుద్ధానికి.. ఆ దేశంలో నాలుగో డోసు

ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది.. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తం అవుతున్నాయి. కొన్ని దేశాల్లో రెండో డోసు పంపిణీ చేయ‌డంలో వేగం పెంచాయి. అలాగే మ‌రి కొన్ని దేశాల్లో మూడో డోసు పంపిణీ చేయ‌డానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కానీ ఇజ్రాయిల్ దేశ ప్రభుత్వం ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొవ‌డానికి ఏకంగా నాలుగో డోసు పంపిణీ చేయ‌డానికి సిద్ధమైపోయింది.

https://ntvtelugu.com/omicrancase-registered-in-the-northeastern-states/

ఇప్పటికే ఇజ్రాయిల్‌లోని 150 మంది వైద్య సిబ్బందికి ఫైజ‌ర్ వ్యాక్సిన్‌ నాలుగో డోసును అందించింది.అయితే ఇజ్రాయిల్‌లో నాలుగో డోసు తీసుకున్న 150 మంది వైద్య సిబ్బంది ఆరోగ్యంగా ఉండి.. వారు ఓమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొగలిగితే దేశ ప్రజలందరికీ సత్వరమే నాలుగో డోసు ఇస్తామని ఇజ్రాయిల్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఇజ్రాయ‌ల్ దేశంలో ఈ ఏడాది ఆగ‌స్టులోనే మూడో డోసును ప్రజలకు పంపిణీ చేశారు. ఇక నాలుగో డోసు పంపిణీ చేయ‌డానికి ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

Exit mobile version