NTV Telugu Site icon

భారత్‌ కరోనా వేరియంట్లు.. వ్యాక్సిన్ల ప్ర‌భావం అంతంత మాత్ర‌మే..!

vaccines

క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్ లో క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. ఈ స‌మ‌యంలో భార‌త్‌లో రెండు కొత్త వేరియంట్లు వెలుగుచూశాయి.. చాలా దేశాల‌ను ఇప్పుడు భార‌త్ క‌రోనా వేరియంట్లు టెన్ష‌న్ పెడుతున్నాయి.. అయితే, ఈ కొత్త స్ట్రెయిన్స్‌పై వ్యాక్సిన్ల ప్ర‌భావం చాలా త‌క్కువ‌గానే ఉంటుంద‌ని చెబుతోంది జ‌ర్మ‌నీ ప్ర‌జారోగ్య సంస్థ.. తమ ప్రా‌థ‌మిక అధ్య‌య‌నాల్లో ఈ సంగ‌తి తేలింద‌ని వెల్ల‌డించారు.. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అధ్య‌య‌న స‌మాచారం త‌క్కువేన‌ని.. ఇది ప్రాథ‌మిక స‌మాచారం మాత్ర‌మేన‌ని.. మ‌రో రెండు వారాల్లో మెరుగైన డేటా సంపాదిస్తామ‌ని జ‌ర్మ‌నీ ప్ర‌జారోగ్య సంస్థ చీఫ్ లోథ‌ర్ వైల‌ర్ తెలిపారు.. మ‌రోవైపు జ‌ర్మ‌నీ ఆరోగ్య‌శాఖ మంత్రి జెన్స్ మాట్లాడుతూ.. బ్రిట‌న్ నుంచి ప్ర‌యాణాల‌ను అనుమ‌తించే విష‌యాన్ని పున‌ర్ ప‌రిశీల‌న చేస్తామ‌న్నారు. ఇటీవ‌ల బ్రిట‌న్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తోంద‌ని.. దీంతో.. బ్రిట‌న్‌ను రిస్క్ రీజియ‌న్‌గా పేర్కొంటోంది జ‌ర్మ‌నీ. కాగా, కొత్త వేరియంట్ల‌పై కూడా ప్ర‌స్తుత వ్యాక్సిన్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తాయ‌ని ప‌లు అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే..