మాములుగా అంబానీ కుటుంబంలోని వాళ్లు ఏ ఈవెంట్ అయిన ఖరీదైన డ్రెస్సులను ధరిస్తారు..ముఖ్యంగా వెడ్డింగ్ డ్రెస్సులు గురించి ఇక చెప్పనక్కర్లేదు ఎంత కాస్ట్ ఉంటాయో అంతకు మించి వార్తలు వినిపిస్తుంటాయి.. అంబానీ వారసురాలు ఇషా అంబానీ పెళ్లి డ్రెస్ కోసం రూ.90 కోట్లు వెచ్చించినట్టుగా వచ్చాయి. పెళ్లి సందర్భంగా ఆమె ధరించిన లెహంగా ప్రపంచంలోనే ఖరీదైనదిగా తెలిసింది. అంతేకాదు.. ఇషా అంబానీ పెళ్లి ఖర్చు 700 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు దానికంటే మించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ లెహంగా కూడా ఉందని తెలిస్తే మీరు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు..
ఇషా అంబానీ గోల్డెన్ లెహంగా ధరించింది.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెహంగా మాత్రం డైమండ్స్ తో తయారు చేశారు..గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, బ్రైడల్ డిజైనర్ రెనీ, ప్రఖ్యాత జ్యువెలర్ మార్టిన్ కాట్జ్ రూపొందించిన డైమండ్ వెడ్డింగ్ డ్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ దుస్తులు.. చాలా అందమైన డ్రెస్సు కూడా.. డైమండ్ వెడ్డింగ్ డ్రెస్‌ను 2006లో మార్టిన్, రెనీ డిజైన్ చేశారు. గౌను ఐవరీ రంగులో ఉంటుంది. దీన్ని అత్యంత నాణ్యమైన విలాసవంతమైన పట్టుతో తయారు చేశారు..
ఈ లెహంగా ఖరీదు 12 మిలియన్లు. ఇది భారతీయ కరెన్సీలో రూ. 99.85 కోట్లు. ఇది ఇషా అంబానీ వివాహ లెహంగా కంటే ఖరీదైనది. కాలిఫోర్నియాలోని విలాసవంతమైన రిట్జ్ కార్ల్టన్ హోటల్‌లో వెడ్డింగ్ గౌన్‌ను డిజైనర్ డ్రెస్సును తయారు చేశారు..ఇషా అంబానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహంగా ధరించిన రికార్డును కలిగి ఉన్నారు.. అద్భుతమైన బంగారు, ఎరుపు రంగులో ఉన్న లెహంగ ధర 90 కోట్లు. లెహంగా ప్రస్తుతం నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు.. మరి వంద కోట్లు పెట్టి ఎవరు ఈ ఖరీదైన డ్రెస్సును సొంతం చేసుకుంటారో చూడాలి..