NTV Telugu Site icon

Costly Cherries : ఈ చెర్రీలు చాలా ఖరీదైనవి.. ప్రత్యేకత ఏంటంటే?

Costly Cherries

Costly Cherries

మనదేశంలో చెర్రీలు ఫెమస్.. వీటిని జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లు, స్వీట్ లలో ఎక్కువగా వాడుతారు.. అందుకే వీటికి ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో కిలో చెర్రీ పండ్ల ధర కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్‌లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.. ఈ చెర్రీలను జూనో హార్ట్‌ చెర్రీలని, అవ్‌మోరీ చెర్రీలని అంటారు.

ఈ చెర్రీలు మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను, రుచిలో మరింత తీపిగాను ఉంటాయి. వీటి ఆకారం మిగిలిన చెర్రీల్లా గుండ్రంగా కాకుండా, హృదయాకారంలో ఉంటుంది.. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటం తో ధరను చూడకుండా ఎక్కువగా వీటిని కొని తింటుంటారు..

అయితే వీటిని కిలోల చొప్పున అమ్మరు. ఒక్కొక్క పండుకే ధరకట్టి ఆ లెక్కన అమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ చెర్రీలు ఒక్కొక్కటి 296 డాలర్ల వరకు ఉంటాయి. అంటే మన కరన్సీ లో దాదాపు రూ. 25 వేలు వరకు ఉంటుంది.. ఇవి 2.8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వ్యాసంలో ఉంటాయి. సాధారణ చెర్రీల కంటే వీటిలో చక్కెర 20 శాతం ఎక్కువగా ఉంటుంది.. అందుకే వీటిని కొన్ని ప్రత్యేమైన స్వీట్స్ లలో మాత్రమే వాడుతారు.. ఏది ఏమైన ఇవి చాలా ఖరీదైనవే.. వీటికి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Show comments