NTV Telugu Site icon

కరోనాపై మళ్లీ హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో

Tedros Adhanom

Tedros Adhanom

కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత సెకండ్‌ వేవ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్‌ వేవ్‌ కొన్ని దేశాలను ఇప్పటికే టచ్‌ చేయగా.. రోజుకో వేరియంట్‌ తరహాలో కోవిడ్ కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే.. తాజా పరిస్థితులపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్‌ అథనోమ్‌.. కరోనా మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని హెచ్చరించారు.. కరోనా డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇది ఎక్కువగా.. తక్కువ మందికి వ్యాక్సిన్లు వేసిన దేశాల్లో విజృంభిస్తోందని.. ఆస్పత్రుల్లో చేరే కోవిడ్ బాధితుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని.. ఇప్పటికీ ఏ దేశం కూడా ఈ ప్రమాదం నుంచి బయట పడలేదన్నారు.. ఇక, డెల్టా వేరియంట్‌ ప్రమాదకరమైందని, వైరస్‌ కాల క్రమేణా మారుతున్నందున దానిపై పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్లను 98 దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు డబ్ల్యూహెచ్‌వో చీప్.. మరోవైపు.. కోవిడ్ బారినపడకుండా.. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం.. రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడంతో ఎంతో కీలకం అన్నారు.. ఇళ్లకు సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలన్న ఆయన.. వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.