Site icon NTV Telugu

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. తాజాగా ఎన్నికేసులంటే..?

కరోనా మహమ్మారి విజృంభన మరోసారి కొనసాగుతోంది. కరోనా డెల్టా వేరియంట్‌కు తోడు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ సైతం దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 18.16 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అమెరికాలో 5.37 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో అమెరికాలో 1300 మందికిపైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో సైతం కరోనా బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా ఫ్రాన్స్‌లో 2.06 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో సుమారు 1.90 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే దీనితో పాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌తో యూఎస్‌, యూకే దేశాల్లో పలు మరణాలు సంభవించాయి.

Exit mobile version