NTV Telugu Site icon

Nupur Sharma Controversy : విదేశాల్లో నిరసన జ్వాలలు.. కువైట్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Nurpur Sharma

Nurpur Sharma

మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ ఇటీవల మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా ముస్లిం దేశాలలో సైతం ఆగ్రహజ్వాలలు రగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నుపుర్‌ శర్మ వ్యాఖ్యలపై కువైట్‌లో ప్రవాసులు నిరసనలు చేపట్టారు. దీంతో కువైట్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిరసనకారులకు హెచ్చిరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వారిని అరెస్ట్‌ చేసిన జైళ్లకు తరలిస్తున్నారు. తమ దేశంలో ప్రవాసులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం నిషిద్ధమని, నిబంధనలను ఉల్లంఘించి నిరసన ప్రదర్శనలు చేపట్టిన విదేశీయులను వారి సొంత దేశాలకు తిప్పిపంపుతున్నట్టు కువైట్ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

ప్రస్తుతం తమ అధికారులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారని, అనంతరం వారి స్వదేశాలకు తరలిస్తారని కువైట్ ప్రభుత్వం వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోసారి వాళ్లు కువైట్ లో ప్రవేశించడంపై నిషేధం ఉంటుందని, అయితే.. నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారు ఏ ఏ దేశాలకు చెందినవారన్నది మాత్రం వెల్లడించలేదు కువైట్‌ ప్రభుత్వం.

Show comments