Site icon NTV Telugu

Israel-Hezbollah: బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్‌బొల్లా మరో కీలక నేత మృతి

Hezbolla

Hezbolla

Israel-Hezbollah: హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన ఆఫీసు అధిపతి సోహిల్ హొసైన్‌ హొసైనీని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ హతమర్చినట్లు ఈరోజు (మంగళవారం) ప్రకటించింది. సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం అందించిన ఖచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో హొసైనీ మరణించాడని ఇజ్రాయెల్‌ సైనిక దళాలు పేర్కొన్నాయి. కాగా, ఈవిషయంపై ఇప్పటి వరకు హెజ్‌బొల్లా నుంచి ఎలాంటి స్పందన లేదు.

Read Also: Mayor Murder: 6 రోజుల క్రితమే మేయర్‭గా బాధ్యతలు.. ఆపై దారుణ హత్యకు గురి

ఇక, హమాస్‌లో కీలక నేతలే లక్ష్యంగా గత కొంత కాలంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. సోమవారంతో గాజా యుద్ధానికి ఏడాది పూర్తవడంతో హమాస్, బీరుట్‌పై ఏకకాలంలో బాంబులతో దాడి చేసింది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా నిర్విరామంగా వైమానిక దాడులు చేస్తుంది. అలాగే, ఆదివారం గాజాలో హమాస్‌పైనా ఐడీఎఫ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేర్‌ అల్‌-బలాహ్‌లోని ఓ మసీదు, ఓ స్కూల్ పై బాంబులతో దాడి చేసింది. ఈ రెండు ఘటనల్లో 26 మంది పాలస్తీనియన్లు మరణించారు. తాము హమాస్‌ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని ఇజ్రాయెల్ కు చెందిన ఐడీఎఫ్‌ సిబ్బంది పేర్కొంది.

Exit mobile version