Christopher J Beale Facing Sleepless Nights Due To Twitter X Logo: తాను ట్విటర్‌ని సొంతం చేసుకున్నప్పటి నుంచి.. అప్డేట్‌ల పేరుతో ఎలాన్ మస్క్ దాంతో చెడుగుడు ఆడుకుంటున్న విషయం తెలిసిందే. ‘టిక్కు’ రంగులు, ట్వీట్ లిమిట్‌లు, ఇంకా ఏవేవో మార్పులు చేస్తూ.. ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇక కొన్ని రోజుల కిందట అయితే.. ఈ సోషల్ మీడియా ప్లాట్‌పామ్ పేరుని ‘X’గా మార్చేశాడు. అంతేకాదు.. పిట్టను లేపేసి, ఆ అక్షరాన్ని లోగోగా పెట్టుకున్నాడు. ఈ లోగో విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తన హెడ్ క్వార్టర్స్‌పై X లోగోని మస్క్ మలచడం మరో ఎత్తు. చాలా పెద్దగా ఆ లోగోని బిల్డింగ్‌పై సెట్ చేసి.. దానికి కళ్లుచెదిరే లైటింగ్ అమర్చాడు. ఇది చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ.. ఓ యువకుడ్ని మాత్రం ఈ లోగో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ లోగో తన చావుకి వచ్చిందంటూ.. పాపం ఆ యువకుడు గగ్గోలు పెడుతున్నాడు.
Ambati Rambabu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడికి రాజధాని రైతుల విన్నపం
అసలు మేటర్ ఏమిటంటే.. ఈ ట్విటర్ లోగో హెడ్‌క్వార్టర్స్ ఎదురుగా ఉంటున్న ఒక బిల్డింగ్‌లో క్రిస్టోఫర్ జే. బీలే అనే యువకుడు నివసిస్తున్నాడు. ట్విటర్ హెడ్ క్వార్టర్స్‌పై అమర్చిన రేడియంట్ లైట్.. గడియగడియకు వెలుగుతూ, ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్ పై ప్రతిబింబంలా పడుతోంది. మధ్యమధ్యలో ఆ లైట్ డిస్కో డ్యాన్స్ చేసినట్లు వెలుగుతుంది. ఈ లైటింగ్ నేరుగా క్రిస్టోఫర్ రూమ్‌లోకి దూసుకొస్తోంది. దీంతో.. ఈ లైటింగ్ కారణంగా తాను సరిగ్గా నిద్రపోలేక పోతున్నానని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు.. లోగో లైటింగ్‌కు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశాడు. ‘‘చూడండి, ఇదీ నా పరిస్థితి. పగలేమో ఆ లైట్ల పనితీరుని టెస్ట్ చేస్తారు. రాత్రి అవ్వగానే.. కళ్లు జిగేల్‌మనేలా లైటింగ్ నేరుగా నా బెడ్‌రూంలోకి వస్తోంది చూడండి’’ అంటూ.. ఆ లోగో వల్ల తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని పంచుకున్నాడు. దీంతో.. నెటిజన్లు అతనికి మద్దతుగా నిలుస్తూ.. మస్క్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.
Imagine no more. This is my life now. https://t.co/k5QfAm8yuG pic.twitter.com/e7ECCM2NUD
— Christopher J. Beale (@realchrisjbeale) July 29, 2023
