NTV Telugu Site icon

Job In Cemetery: చదివింది డిగ్రీ.. శ్మశానంలో ఉద్యోగం.. ఎందుకో తెలిస్తే ఔరా! అనాల్సిందే..

Chinese Woman

Chinese Woman

చేతిలో డిగ్రీ పట్టా పడిందంటే చాలు.. ఉన్నత చదువుల కోసం చూసేవారు కొందరైతే.. మంచి ఉద్యోగం చేసుకుందాం అనుకునేవారు మరికొందరు.. కానీ, డిగ్రీ పూర్తి చేసిన ఓ యువతి.. శ్మశానంలో ఉద్యోగం చేస్తున్న ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇంతకీ.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆ యువతి.. ఎందుకు శ్మశానంలో ఉద్యోగం చేస్తోంది.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన 22 ఏళ్ల టాన్‌ అనే యువతి.. స్థానికంగా ఓ ప్రముఖ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి పట్టా అందుకుంది.. అయితే, అందరిలా ఏ ప్రభుత్వ ఉద్యోగం కోసమో.. కార్పొరేట్‌ సంస్థలో జాబ్‌ కోసమో ఆమె ప్రయత్నం చేయలేదు.. స్థానికంగా ఉన్న శ్మశానవాటికలో సహాయకురాలి పోస్టుకు దరఖాస్తు చేసుకుంది.. ఆమెకు ఉద్యోగం రావడం.. ప్రస్తుతం ఆ ఉద్యోగమే చేస్తోంది.

Read Also: Ashok Hotel: త్వరపడండి.. అమ్మకానికి చారిత్రాత్మక అశోకా హోటల్

శ్మశానవాటికకు వచ్చే మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన పనులతో పాటు ఆ శ్మశానంలో ఉన్న సమాధులపై చెత్తాచెదారం చేరకుండా చూసుకోవడమే ఆ యువతి ప్రస్తుత ఉద్యోగం.. అయితే, ఈ విషయం కాస్తా.. సోషల్‌ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తోంది.. నెటిజన్లు కామెంట్లు పెడుతూ.. ఆమెను ప్రశంసిస్తున్నారు.. డిగ్రీ చదివి ఇదేం పని? అనే ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు.. ఇక, తాను శ్మశానంలో ఉద్యోగం చేయడానికి గల కారణాలను వెల్లడించింది టాన్‌.. ఆమె చెప్పిన సమాధానానికి ఔరా! అనాల్సిందే.. ఎందుకంటే.. తాను చేస్తున్న ఈ ఉద్యోగంలో ఎలాంటి ఒత్తిడి, రాజకీయాలు ఉండవు.. అంతేకాదు వర్క్ ప్లేస్ మారదు.. ఇక్కడే జీవితాంతం ప్రశాంతంగా పని చేసుకోవచ్చు అని వెల్లడించింది.. ఇక, ఇక్కడ ఉన్న కుక్కలు, పిల్లులతో నాకు బాగానే టైం పాస్ అవుతుంది. వాటికి తోడు బ్రౌసింగ్ చేయడానికి ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉందంటూ చెప్పుకొచ్చింది టాన్‌..

టాన్‌ చేసే ఉద్యోగంలో వారానికి ఆరు రోజులే పనిదినాలు.. ప్రతీ రోజు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆమె విధులు నిర్వహిస్తుంది.. ఇక, ఈ ఉద్యోగానికి గాను నెలకు భారత కరెన్సీలో దాదాపు రూ.45 వేల జీతం అందుకుంటోంది టాన్.. మొత్తంగా.. ఉన్నత చదవులు చదివి.. ఏ ఉద్యోగం చేసినా.. టెన్షన్‌, ఒత్తిడి తప్పదు.. అంతేకాదు.. వర్క్‌ ప్లేస్‌లో రాజకీయాలు కూడా కొన్ని తలనొప్పులు తెచ్చిపెడతాయి.. కానీ, అలాంటి ఒత్తిడి తనుకు ఎందుకు అనుకున్న టాన్‌ మాత్రం.. శ్మశానంలో ఉద్యోగం చేస్తూ.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయారు.. ఆమె నిర్ణయంపై కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఏ మనిషి అయినా.. తన జీవితంలో కుటుంబం, సంపాదన అంటూ పరుగులు పెట్టినా.. చివరకు చేరాల్సిందే శ్మశానానికే కదా? అంటున్నారు.

Show comments