ఇండో-ఫసిఫిక్‌లో మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఉద్రిక్తతలు తలెత్త కూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం హెచ్చ రించారు. ఆసియా- ఫసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్‌ఫోరమ్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా కొత్త భద్రతా కూటమి ఏర్పడిన తర్వాత చాలా వారాలకు జిన్‌పింగ్‌నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ కూటమిలో ఆస్ట్రేలియా అణు జలాంతర్గ ములను నిర్మించనుంది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భౌగోళిక, రాజకీయ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో సరిహద్దు లను గీయడానికి ప్రయత్నించడం విఫలమవుతుందన్నారు. జిన్ పింగ్ మాట్లాడుతూ.. ఈప్రాంతంలో వాణిజ్యం, పెట్టుబడులను సరళీ కృతం చేయాలన్నారు. చైనా సంస్కరణలు బహిరంగతను కొనసా గిస్తుందని ఆయన అన్నారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం చైనాలో పర్యటించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనికి ప్రతిగా తైవాన్ సమీపంలో సైనిక విన్యాసాలను చైనా నిర్వహించింది. దేశ సార్వభౌ మత్వాన్ని కాపాడాటానికి సైనిక విన్యాసాలు నిర్వహిం చడం తప్పు కాదని చైనా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
తైవాన్ విషయంలో చాలా దేశాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నా యని, స్వతంత్రంగా పిలిచే ద్వీపం స్వాతంత్ర్యం కోసం వాదిస్తు న్నాయని, ఇది తూర్పు థియేటర్ కమాండ్‌కు ఉమ్మడి యుద్ధానికి పిలుపునిచ్చినట్టు చైనా మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, తైవాన్‌తో అమెరికాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో హాంకాంగ్, దక్షిణ చైనా సముద్రం, కరోనావైరస్ మహమ్మారితో చైనా ప్రపంచంలో దోషిగా నిలబడింది. ఈ నేపథ్యంలో అనేక విషయాలపై యూఎస్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జిన్‌పింగ్ జీవితకాల అధ్యక్ష పదవికీ చైనా సీపీసీ ఆమోదించిన తీర్మా నంతో అమెరికా మరింత గుర్రుగా ఉంది. దీంతో ఇండో- ఫిసిఫి క్‌లో చిన్నపాటి యుద్ధవాతావరణమే నెలకొన్నదని చెప్పవచ్చు.
