Weight Loss: సరైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ కారణంగా ఇటీవల యువత భారీగా బరువు పెరుగుతున్నారు. ఆ తరువాత వేగంగా బరువు తగ్గాలని భావిస్తూ అడ్డమైన మెడిసిన్స్, హెవీ వర్కౌట్స్ చేసి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన 21 ఓళ్ల యువతి 90 కిలోలు తగ్గాలనే లక్ష్యంతో పెట్టుకుంది. తీవ్రమైన వ్యాయామం కారణంగా మరణించింది.
ఈ ఘటన చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లోని జియాన్ లో జరిగింది. కుయిహువా అనే యువతి, బరువు తగ్గించే క్యాంపులో చేరింది. వచ్చీరావడంతోనే పూర్తిగా ఫిట్ నెస్ వర్కవుట్స్ పై దృష్టి పెట్టింది. అధికంగా శరీరంపై ఒత్తిడి పెడుతూ వ్యాయామంలో పాల్గొనడంతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది.
Read Also: Manipur Violence: మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం పొడిగింపు
ఆమె తన వర్కవుట్స్ గురించి 100కు పైగా వీడియోలు అప్లోడ్ చేసింది. అధిక తీవ్రత కలిగిన కార్డియో, వెయిట్ లిప్టింగ్ వంటి వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. దీంతో పాటు ముతక ధాన్యాలు, క్యాబేజీ, గుడ్లు, పండ్లతో కూడిన కఠిన డైట్ పాటిస్తున్నట్లు వీడియోల్లో తెలిపింది. ఆమె ఆరు నెల్లలో 36 కిలోలు తగ్గింది. అయితే మొదటి రెండు నెల్లోనే 90 కిలోలు తగ్గాలనే లక్ష్యంగా పెట్టుకుని 25 కిలోలు కోల్పోయిందని షాంఘై మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.
ఇన్‌ఫ్లుయెన్సర్‌కు డౌయిన్‌లో దాదాపు 10,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే కుయిహువా చైనాలోని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బరువు తగ్గే క్యాంపుల్లో వ్యాయామాలను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ గుండె పోట్లకు కారణం అవుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చైనాలో ఓ నివేదిక ప్రకారం..సగం మంది జనాభా అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు.
