Site icon NTV Telugu

China Victory Day Parade: బీజింగ్‌లో విక్టరీ డే వేడుకలు.. హాజరుకానున్న పుతిన్‌, కిమ్‌ జాంగ్‌ ఉన్‌..!

China

China

China Victory Day Parade: రెండో ప్రపంచ యుద్ధంలో తమపై దండయాత్రకు దిగిన జపాన్‌పై గెలిచినందుకు గుర్తుగా చైనా నిర్వహించనున్న విక్టరీ డేకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సహా 26 మంది విదేశీ నాయకులు పాల్గొననున్నారు. సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్‌ దురాక్రమణకు ప్రతిఘటన పేరుతో సెప్టెంబర్ 3న బీజింగ్‌లో ఈ వేడుక నిర్వహించబోతున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది.

Read Also: Urjit Patel: మాజీ ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యత..

ఇక, చైనా నిర్వహించే ఈ సైనిక కవాతు ఇరుదేశాల మధ్య వివాదానికి దారి తీసింది. జపాన్‌ వ్యతిరేక సూచనలు ఉన్న ఈ వేడుకలో పాల్గొన వద్దని ప్రపంచ దేశాల నాయకులను టోక్యో వేడుకుంది. జపాన్‌ చేసిన ఈ అభ్యర్థనపై బీజింగ్ నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు, జపాన్‌లో రెండు రోజుల పర్యటన తర్వాత భారత ప్రధాని మోడీ ఈ నెల 31న షాంఘై శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన వారందరూ చైనా సైనిక కవాతులో పాల్గొంటారని ఆ దేశ విదేశాంగ శాఖ తెలియజేసింది.

Exit mobile version