NTV Telugu Site icon

America-China: అమెరికా యుద్ధమే కోరుకుంటే తాము పోరాటానికి సిద్ధం.. వెల్లడించిన చైనా

America China

America China

America-China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చైనా దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడంతో చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా యుద్ధమే కోరుకుంటే తాము చివరి వరకూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చైనా హెచ్చరించింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించారు. కానీ, ఇప్పుడు ఆ సుంకాలను 20 శాతం చేసిన తర్వాత చైనా ప్రతిస్పందించింది.

Read Also: Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం

ఇందులో భాగంగా అమెరికా ఉత్పత్తులపై కూడా సుంకాలు విధించిన చైనా, ఫెంటానిల్ (Fentanyl) సమస్యను చిన్న సాకు అని వ్యాఖ్యానించింది. అమెరికా బెదిరింపులు తమను భయపెట్టలేవని, తమ హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఫెంటానిల్ ఒక ప్రమాదకరమైన మాదక ద్రవ్యం. అది అక్రమంగా అమెరికాకు వస్తోంది. దీని వల్ల ప్రతీ సంవత్సరం లక్షల మంది మరణిస్తున్నారు. వలసదారుల ద్వారా ఈ మాదక ద్రవ్యాలు కెనడా, మెక్సికో దేశాల నుంచి అమెరికాకు వస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. దింతో చైనా, అమెరికా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది.