H3N8 Bird Flu: మానవుల్లో అత్యంత అరుదుగా కనిపించే బర్డ్ ఫ్లూతో చైనాలో ఒకరు మరణించారు. ప్రపంచంలోనే ఇలా మరణించడం ఇదే మొదటిసారి. అయితే ప్రజల నుంచి ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దక్షిణ ప్రావిన్స్ ఆఫ్ గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా H3N8 సబ్‌టైప్ బారిన పడిన మూడవ వ్యక్తి అని డబ్ల్యూహెచ్ఓ మంగళవారం తెలిపింది.
Read Also: Nitish Kumar Meets Rahul Gandhi: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం.. రాహుల్ తో నితీష్, తేజస్వీ భేటీ..
ఈ ముగ్గురు కూడా చైనాకు చెందినవారే. గత ఏడాది రెండు కేసులు నమోదు అయ్యాయి. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్షియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గత నెల చివర్లో H3N8 బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ బాధపడుతూ ఓ మహిళ మరణించిందని నివేదించింది. అయితే మహిళ మరణానికి సంబంధించిన వివరాలను అందించలేదు. మహిలకు పౌల్ట్రీ రంగంతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. చైనాలో ఏవియన్ ఫ్లూ వైరస్లు భారీ పౌల్ట్రీ, ఇతర అడవి పక్షుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. దీంతో అక్కడి ప్రజలు బర్డ్ ఫ్లూకు గురువుతున్నారు.
మహిళ అనారోగ్యానికి గురికాకముందే ఆమె సందర్శించిన మార్కెట్ నుంచి సేకరించిన నమూనాల్లో ఇన్ఫ్లుఎంజా A(H3) ఉన్నట్టుగా తేలిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇదే మహిళకు సంక్రమించడానికి మూలం కావచ్చని అంచానా వేసింది. ప్రజలలో చాలా అరుదుగా ఉన్నప్పటికీ, పక్షులలో H3N8 సాధారణం. ఇదిలా ఉంటే మహిళకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షనాలు కనుగొనలేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులభంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి లేదని తెలుస్తోంది. మానవుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.