Site icon NTV Telugu

US-China Trade War: నువ్వు భయపెడితే భయపడం.. అమెరికాకు చైనా వార్నింగ్

China

China

US-China Trade War: చైనా – అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. పన్నుల విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ విధించిన డెడ్‌ లైన్‌కు తాము భయపడబోమని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం పద్దతి కాదన్నారు. తమ దేశంపై విధించిన 34 శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డొనాల్డ్‌ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేకపోతే చైనాపై అదనంగా మరో 50 శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. దీని కోసం 48 గంటల సమయం ఇచ్చారు.

Read Also: Cyberabad: మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం.. ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు

ఇక, ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై చైనా కూడా ధీటుగా రియాక్ట్ అయింది. అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని వెల్లడించింది. ఈ తరహా బెదిరింపులు మంచి పద్దతి కాదని తెలిపింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు చెప్పుకొచ్చారు. ట్రంప్ విధించిన 48 గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని క్వశ్చన్ చేసింది. బదులుగా, పెంగ్యు రియాక్ట్ అవుతూ.. తమపై ట్రంప్‌ టారిఫ్‌ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోం.. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడొద్దని ఇప్పటికే చెప్పాం.. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుందని లియు పెంగ్యు వెల్లడించారు.

Exit mobile version