China President: తమ దేశం మున్ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తెలిపారు. రానున్న రోజుల్లో తీవ్ర సవాళ్లు ఎదురు కానున్నాయి.. భారత్ సహా పొరుగు దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికాతో తీవ్ర పోటీ, ఆర్థికంగా ప్రతికూల గాలుల వీయడం లాంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. 75 జాతీయ దినోత్సవం సందర్భంగా బీజింగ్‌లోని తియానన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్‌పింగ్ మాట్లాడారు.
Read Also: Ponguru Narayana: త్వరలో ఏపీ వ్యాప్తంగా కూల్చివేతలు.. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని హెచ్చరిక
కాగా, మున్ముందు చైనాకు ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఎదురుకావొచ్చు అని అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ముందుకెళ్లాలి అని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీతో పాటు మొత్తం సైన్యం, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉండాలన్నారు. అప్పుడు ఏ కష్టాలు కూడా చైనీయులను అడ్డుకోలేవు అని చైనా అధ్యక్షుడు చెప్పారు. తైవాన్ స్వాతంత్ర్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. అది తమ దేశంలో భాగమన్నారు. జలసంధికి ఇరువైపుల ఉన్న ప్రజల మధ్య రక్తసంబంధం ఉందని డ్రాగన్ కంట్రీ అధినేత జిన్‌పింగ్ వెల్లడించారు.
Read Also: Govinda: గన్ సీజ్.. ఆడియో మెసేజ్ రిలీజ్ చేసిన గోవింద
ఇక, అంతర్గత సమస్యలు, మందగించిన స్థిరాస్తి మార్కెట్, చైనా ఎలక్ట్రిక్ వెహికిల్స్, బ్యాటరీలపై అమెరికా, ఈయూ అధిక పన్నులు విధించడం లాంటి సవాళ్లను చైనా ప్రస్తుతం ఎదుర్కొంటోంది అన్నారు. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి సంస్కరణల చాలా అవసరం ఉందని జిన్‌పింగ్ పేర్కొన్నారు.