ఆసియాలో అన్ని దేశాలపై ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సముద్రంలోని పరాసెల్ దీవులు పరిధిలో ఉన్న సముద్ర జలాలు తమవే అంటే తమవే అని చైనా, వియాత్నం, తైవాన్‌లు వాదిస్తున్నాయి. ఇందులో బలం, బలగం అధికంగా ఉన్న చైనా ఈ జలాలపై ఆదిపత్యం చెలాయిస్తున్నది. 2016, జులై 12 వ తేదీన అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. ఈ జలాలపై చైనాకు హక్కులేదని తీర్పు ఇచ్చింది. అయితే, అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన చైనా, జలాలపై పట్టుకు కోల్పోయే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేసింది.
Read: “మిమి” ట్రైలర్ : ఫన్నీ గా సరోగసీ మదర్ జర్నీ… ఎమోషన్స్ కూడా !
ఇక ఇదిలా ఉంటే, దక్షిణ చైనా సముద్రంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికాకు చెందిన యూఎస్ఎస్ బెన్‌ఫోల్డ్ నౌకను తరిమికొట్టినట్టు చైనా లిబరేషన్ ఆర్మి ప్రకటించింది. పరాసెల్ దీవుల జలాల్లోకి ఎవరు ప్రవేశించాలన్న తమ అనుమతి తప్పనిసరి అని లేదంటే అమెరికా నౌనకు తరిమికొట్టిన విధంగానే తరిమికొడతామని చెబుతున్నది. దీనిపై అమెరికా అధికారులు స్పందించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారమే పరాసెల్ దీవుల వద్ధ బెన్‌ఫోల్డ్ తన స్వేచ్ఛను వినియోగించుకున్నట్టు అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఈ పరాసెల్ దీవుల సముదాయంలో సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉండటంతో ఈ జలాలపై ఆదిపత్యం కోసం వివిధ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
