Site icon NTV Telugu

డెల్టా వేరియంట్‌ పంజా.. వణికిపోతున్న డ్రాగన్‌ కంట్రీ..!

China

China

కరోనా పుట్టినిల్లు చైనా ఇప్పుడు వణికిపోతోంది… రోజుకో కొత్త వేరియంట్‌ తరహాలో ప్రపంచాన్ని ఓ కుదుపు కుదేపిసింది కరోనా వైరస్.. ఇప్పుడు.. డెల్టా వేరియంట్‌ డ్రాగన్‌ కంట్రీ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది… చైనా వ్యాప్తంగా కొత్తగా 500 డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.. అవి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదు అయ్యాయి… దీంతో, అప్రమత్తం అయిన ప్రభుత్వం.. కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న 144 ప్రాంతాల్లో ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌, ట్యాక్సీ సేవ‌ల‌ను ర‌ద్దు చేసింది.. మరోవైపు.. బీజింగ్‌లోనూ రైలు, స‌బ్‌వే స‌ర్వీసుల‌ను నిలిపేశారు. ఇవాళ కొత్తగా 94 కేసులు న‌మోద‌య్యాయి. చైనా జ‌నాభాలో 61 శాతం మందికి వ్యాక్సిన్లు వేసినా.. కేసుల సంఖ్య మళ్లీ పెరగడం అధికారులకు ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే, చైనా కరోనా వ్యాక్సిన్లు విస్తృతంగా వేస్తున్నా… అవి డెల్టా వేరియంట్‌పై ఏమేరకు ప్రభావం చూపుతాయి అనేదానిపై స్పష్టతలేదు.. దీంతో.. మరోసారి కఠిన ఆంక్షల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. బీజింగ్‌లో థియేట‌ర్లు, పార్కులు వంటి అన్ని వినోద సంబంధిత ప్రదేశాల‌పై ఆంక్షలు విధించింది సర్కార్.. చైనీస్ వ్యాక్సిన్ తయారీదారులు కూడా తమ వ్యాక్సిన్‌ డెల్టా వేరియంట్‌పై కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని ఎలాంటి ప్రకటన చేయలేదు.. కేవలం రెండు వారాల్లో నమోదైన కేసులు 500కు పైగా చేరడంతో అప్రమత్తం అయ్యారు అధికారులు.. మరోవైపు.. మరింత విస్తృతంగా పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతోంది చైనా.. బిజినెస్ ట్రిప్‌లు, ఇతర పర్యటనలు రద్దు చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు.. ఇక, దేశవ్యాప్తంగా కొన్ని కళాశాలలు, కొత్త సెమిస్టర్ కోసం పాఠశాలకు తిరిగి ప్రారంభించడాన్ని కొంత ఆలస్యం చేయాలని సూచించింది.. చిన్నారులపై వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు.

Exit mobile version