China Floods: భారత్‌లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- చైనాను ముంచెత్తిన భారీ వరదలు
- 22 మంది మృతి.. 22 మంది గల్లంతు
- భారత్‌లో మాత్రం దంచికొడుతున్న ఎండలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో ఎండలు దంచికొడుతుంటే.. చైనాలో మాత్రం భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. వర్షాలు కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. 20 మంది గల్లంతయ్యారు. ఇక రంగంలోకి దిగిన అత్యవసర బృందాలు సహాయ చర్యలు చేపట్టారు.
ఈ వారం ప్రారంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా చైనాలోని పలు ప్రావిన్సులలో 22 మంది మరణించగా, 20 మందికి పైగా ఇప్పటికీ గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. అత్యంత ఘోరమైన ప్రమాదం గ్వాంగ్జీ ప్రావిన్సులో జరిగింది. వ్యవసాయ కార్మికులను తీసుకువెళ్తున్న ఒక పికప్ ట్రక్కు ఉప్పొంగిన నదిలో కొట్టుకుపోవడంతో 10 మంది మరణించారు. సైన్యం, అత్యవసర బృందాల సహాయంతో ప్రభావిత ప్రావిన్సుల నుంచి 24,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
మే 19న గ్వీజౌ ప్రావిన్స్‌లోని డుయున్ నగరంలో కేవలం 24 గంటల్లోనే 310 మిల్లీమీటర్లకు పైగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీనివల్ల జియాన్‌జియాంగ్ నది తన గట్లను తెంచుకుని, పొంగిపొర్లుతున్న నదీ జలాలు డుయున్ వీధులను ముంచెత్తాయి. నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు బొమ్మల్లా తేలియాడుతుండగా.. చాలా వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..