NTV Telugu Site icon

China New Virus: చైనాలో కొత్త వైరస్.. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి..

China New Virus

China New Virus

China New Virus: కోవిడ్-19 మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి తీవ్రమైంది. రిపోర్టులు, సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా ఈ వ్యాధి చైనాలో వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల ముందు రోగులు క్యూ కడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఇన్‌ఫ్లుయెంజా ఏ, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 మల్టిపుల్ వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని చెప్పారు. ధ్రువీకరించబడనప్పటికీ.. చైనా అత్యవసర పరిస్థితి ప్రకటించిందనే వాదలను కూడా వినిపిస్తున్నాయి. HMPV ఫ్లూ లక్షణాలతో పాటు కోవిడ్-19 లక్షణాలను కలిగి ఉంటుదని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందడంపై అక్కడి అధికారులు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు.

Read Also: Blinkit: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్.. కాల్ చేసిన టెన్ మినిట్స్‌లోనే..!

వైరస్ లక్షణాలు: 

చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC చైనా) ప్రకారం.. hMPV వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లో బ్రోన్కైటిస్ లేదా న్యూమోనియాకు దారి తీయవచ్చు. ముఖ్యంగా శిశువులు, వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) లేదా ఎంఫిసెమా వంటి లంగ్స్ జబ్బులు ఉన్నవారు తీవ్రమైన ఫలితాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని చైనా అధికారులు పేర్కొన్నారు. సీడీసీ చైనా ప్రకారం.. వైరస్ ప్రధానంగా దగ్గు, తుమ్మడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. వ్యాధి పొదిగే కాలం 3 నుంచి 5 రోజుల వరకు ఉంటుందని చెప్పింది.

Show comments