కరోనా పుట్టినిల్లుగా పేర్కొనే చైనాలో మళ్లీ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. చైనాలో ఇంకా కొన్ని నగరాల్లో కోవిడ్ లాక్‌డౌన్లు కొనసాగుతున్నాయి. ఆ పట్టణాల్లో ఆహార, నిత్యావసరాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం 30 ప్రదేశాల్లో లక్షలాది మందికి స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు అక్కడి అధికారులు.. కొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా, కొన్ని చోట్ల పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంది. కనీసం 15 రోజుల నుంచి ఏమీ దొరకడం లేదని… జిన్‌జియాంగ్‌కు చెందిన కొంత మంది ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్టోబర్‌లో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనుండడంతో.. కోవిడ్‌ను నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, గడిచిన 24 గంటల్లో చైనాలో కొత్తగా… 949 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జిన్‌జియాంగ్‌లో కజకస్తాన్ బోర్డర్ వద్ద కొన్ని వారాల నుంచి లాక్‌డౌన్ అమలులో ఉంది. అక్కడ పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు కోవిడ్ మహమ్మారితో పాటు.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆహార కొరత డ్రాగన్ కంట్రీకి సవాల్‌గా మారినట్టు తెలుస్తోంది.
Read Also: Kadiyam Srihari: మోడీ ఇక చాలు.. మాకు తెలంగాణ మోడల్ కావాలి..!