China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్‌కు డేంజరేనా?
- చైనాలో మళ్లీ కరోనా కలకలం..
- 79 వేల కేసులు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026లో తొలిసారిగా కరోనా వైరస్ వ్యాప్తి ఇన్ఫ్లుయెంజాను దాటేసి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధిగా నమోదైంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, గత ఏడాది పరిస్థితులతో పోలిస్తే ఈసారి వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
జూన్‌లో 79 వేల కొత్త కేసులు
చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 13 నుంచి 19 వరకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు 16.3 శాతానికి చేరుకుంది. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 4.3 శాతం పాయింట్లు ఎక్కువ. అదే సమయంలో ఫ్లూ పాజిటివిటీ రేటు 12.6 శాతంగా నమోదైంది. జూన్ 2026లో దేశవ్యాప్తంగా 79 వేల కొత్త కరోనా కేసులు నమోదవగా, వాటిలో 130 మంది పరిస్థితి విషమంగా మారింది. ఈ కాలంలో ఒక మరణం మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్‌కు చెందిన NB.1.8.1 వేరియంట్ ప్రధానంగా వ్యాపిస్తున్నట్లు సీడీసీ తెలిపింది. ఈ వేరియంట్ వ్యాప్తి సామర్థ్యం మధ్యస్థంగా ఉందని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి అధిక ప్రమాదం కలిగించే కొత్త వేరియంట్లు ఏవీ గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
భయపడాల్సిన అవసరం ఉందా..
కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మందికి జ్వరం, గొంతునొప్పి, అలసట వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటున్నారని తెలిపారు. తీవ్రమైన కేసులు లేదా మరణాల్లో అసాధారణ పెరుగుదల లేదని, ప్రస్తుతం నమోదవుతున్న ఇన్ఫెక్షన్ రేటు 2025లో నమోదైన కరోనా వేవ్ కంటే బలహీనంగానే ఉందని వెల్లడించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చైనా సీడీసీ సూచించింది. రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రుల్లో మాస్కులు ధరించాలని, అవసరమైతే బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచించింది.
గతంలో కరోనా, ఫ్లూ కేసులు ప్రధానంగా చలికాలంలో పెరిగేవి. అయితే ఇప్పుడు వేసవిలో కూడా కేసులు పెరుగుతున్నాయి. తీవ్ర ఎండల కారణంగా ప్రజలు ఎక్కువసేపు ఏసీ గదుల్లో గడపడం, వేసవి సెలవుల్లో ప్రయాణాలు పెరగడం వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులు సృష్టిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనాలో కేసులు పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు కేసులు నమోదైనప్పటికీ, బాధితుల్లో ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం పెద్ద ముప్పుకు ఎలాంటి సంకేతాలు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే చైనాలో తాజా పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..