Site icon NTV Telugu

Nancy Pelosi: మమ్మల్ని ఆపడం చైనా తరం కాదు.. డ్రాగన్‌పై పెలోసీ కౌంటర్

Nancy Pelosi

Nancy Pelosi

Nancy Pelosi: చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇటీవల తైవాన్ పర్యటనను అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ విజయవంతంగా ముగించారు. తాజాగా మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదన్నారు. ఆ దేశాన్ని ఏకాకి చేస్తానంటే తాము చూస్తూ ఊరుకోబోమని పెలోసీ హెచ్చరించారు. ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్న పెలోసీ మీడియాతో మాట్లాడారు. తైవాన్‌ను ఒంటరి చేయాలని డ్రాగన్‌ భావిస్తోందని ఆమె అన్నారు. ఆ ద్వీప దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరకుండా అడ్డుకుందని మండిపడ్డారు. తైవాన్‌ దేశస్థులు ఎక్కడకీ వెళ్లకుండా.. ఎందులోనూ పాల్గొనకుండా చైనా అడ్డుకోగలదేమో.. కానీ, తమను అక్కడకు వెళ్లకుండా అడ్డుకోలేరన్నారు. తన పర్యటనతో ద్వీప దేశంలో యథాతథ స్థితిని మార్చాలన్న ఉద్దేశం లేదని.. అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడమే తమ ప్రయత్నమని నాన్సీ పెలోసీ పేర్కొన్నారు.

చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడంతో చైనా ప్రతీకార చర్యలకు పాల్పడింది. తైవాన్‌పై ఆర్థికపరమైన ఆంక్షలతో పాటు ఆ దేశంలో భారీ సైనిక విన్యాసాలను ప్రారంభించారు. చైనా డ్రిల్స్‌ కారణంగా అనేక విమానాలు దారిమళ్లించుకోవాల్సి వచ్చింది. కాగా.. ఈ పరిణామాలపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాది పూర్తిగా రెచ్చగొట్టే చర్యేనని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు.

చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా సెనేట్ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మంగళవారం తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆ వెంట‌నే చైనాకు వ్యతిరేకంగా స్పందించారు. తైవాన్‌ను ఏక‌ప‌క్షంగా క‌లిపేసుకోవాల‌న్న చైనా చ‌ర్యల‌ను అమెరికా వ్యతిరేకిస్తుంద‌న్నారు. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్‌ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్‌ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్‌ సర్కార్‌

తన పర్యటన.. తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు విషయంలో అమెరికా నిబద్ధతను చాటుతోందని నాన్సీ పెలోసీ ట్వీట్‌ చేశారు. నిరంకుశత్వం, ప్రజాస్వామ్యాల మధ్య ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తోన్న ప్రస్తుత తరుణంలో.. తైవాన్‌లోని 23మిలియన్ల మంది ప్రజలకు అమెరికా సంఘీభావం ఇప్పుడు చాలా ముఖ్యమని అన్నారు. ‘తైవాన్ నాయకత్వంతో చర్చలు.. మా మద్దతును పునరుద్ఘాటిస్తాయి. స్వేచ్ఛాయుత ఇండో- పసిఫిక్ ప్రాంత అభివృద్ధి, ఉమ్మడి ప్రయోజనాల దిశగా సాగుతాయి’ అని పేర్కొన్నారు.

Exit mobile version