China: చైనా ఆర్మీ జనరల్‌ను అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రభుత్వం హఠాత్తుగా మార్చేశాడు. కొత్త పొలిటికల్ కమిషనర్‌గా జనరల్ చెన్ హుయ్‌కు పదవీ బాధ్యతలు ఇచ్చింది. దీంతో జిన్‌పింగ్ సైన్యం పట్టును నిలుపుకోవడానికి మరో అడుగు వేసినట్లైంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న క్విన్ షుటాంగ్ స్థానాన్ని ఆయన భర్తీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చైనా వార్త సంస్థలు ప్రకటించాయి. ఈ మార్పునకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అలాగే, క్విన్‌కు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారనే కూడా ప్రకటించలేదు.
Read Also: Vijay Rashmika : ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా బుక్ అయిన విజయ్, రష్మిక.. ఎక్కడికి పోతున్నారేంటి ?
అయితే, ఏడాదిగా చెన్ హుయ్ ఏరోస్పేస్ ఫోర్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పదాతిదళంలో ఆయనకు అనుభవం లేదు. కానీ, జిన్‌పింగ్‌కు విశ్వాసపాత్రుడనే కారణంతో అతడికి ఆ పదవిని అప్పగించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాధ్యతల నుంచి తొలగించిన క్విన్ షుటాంగ్‌ను, లీక్వియావోమింగ్‌ను కొత్త ఆర్మీ జనరల్ చెన్ బాధ్యతల స్వీకరణోత్సవానికి ఆహ్వానించలేదు. సంప్రదాయానికి విరుద్ధంగా కొనసాగుతున్న ఈ పరిణామాలపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.