Site icon NTV Telugu

రైళ్ల‌కోసం ప‌ట్టాల‌పై మంట‌లు… ఎందుకంటే…

ప్ర‌స్తుతం అమెరికాలో మంచు భీభ‌త్సం సృష్టిస్తోంది. మంచు తుపాన్ కార‌ణంగా ల‌క్ష‌లాది ఇళ్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. వేలాది విమాన స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. రైలు ప‌ట్టాల‌పై మంచు పేరుకుపోవ‌డంతో అనేక రైళ్లు ర‌ద్ద‌య్యాయి. అయితే, చికాగో రైల్వే అధికారులు దీనికోసం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను కనిపెట్టారు. మంచుకార‌ణంగా రైలు ప‌ట్టాలు కుంచించుకుపోయి రైళ్ల రాక‌పోక‌లు ఇబ్బందులు క‌లుగుతుండ‌టంతో రైళ్ల ప‌ట్టాల‌పై మంట‌ల‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప‌ట్టాలు వెచ్చ‌గా మారి రైళ్ల రాక‌పోక‌ల‌కు అనువుగా మారుతున్నాయి. అయితే, ఇవి నిజ‌మైన మంట‌లు కాద‌ని, ప్ర‌త్యేక‌మైన ట్యాబుల‌ర్ వ్య‌వ‌స్థ‌తో ఏర్పాటు చేసిన మంట‌లు అని, వీటి వ‌ల‌న రైళ్ల‌కు ఎలాంటి మంట‌లు అంటుకోవ‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. శీతాకాలం ముగిసిన త‌రువాత ఈ ప్ర‌త్యేక‌మైన ట్యాబుల‌ర్ వ్య‌వ‌స్థ‌ను తొలగిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.

Read: దేశంలో అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ ఛార్జింగ్ ఎక్క‌డుందో తెలుసా?

Exit mobile version