Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- ఆఫ్రికా దేశంలో ఘోరం
- బంగారు గని కూలి 100 మంది మృతి
- శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్రికా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో బంగారు గని కూలిపోవడంతో 100 మందికి పైగా మరణించారు. పదులకొద్దీ శిథిలాల కింద చిక్కుకుపోయారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పశ్చిమ ప్రాంతంలోని ఒక బంగారు గని మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. స్థానిక అధికారులు సహాయక చర్యలలో నిమగ్నమైయ్యారు. రెడ్ క్రాస్ ప్రకారం.. అబ్బా ప్రాంతంలోని ఒక చిన్న బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది. మొదట 30 మంది మరణించినట్లు నివేదించగా.. ఆ తర్వాత ఆ సంఖ్య 100కి పైగా పెరిగింది. మృతదేహాలను వెలికితీయడానికి సహాయక సిబ్బంది గంటల తరబడి చేతులతో బురద, శిథిలాలను తొలగించారు.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
గని లోపల ఇంకా చాలా మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులు, సహాయక సిబ్బంది కలిసి శిథిలాలను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గనిలోకి ప్రవేశించడం అత్యంత కష్టంగా ఉండటంతో చిక్కుకున్న వారిని త్వరగా రక్షించడం సహాయక బృందాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. సమయం గడిచేకొద్దీ వారిని సజీవంగా కనుగొనే అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గని కూలిపోయిన తర్వాత సహాయక చర్యలకు అవసరమైన యంత్రపరికరాలు అందుబాటులో లేవు. సహాయక సిబ్బంది, స్థానిక నివాసితులు చేతులతోనే బురదను, శిథిలాలను తొలగించారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.
స్థానిక ప్రజలు బంగారం కోసం తవ్వే ఒక చిన్న బంగారు గని . సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఇటువంటి చిన్న తరహా గనుల తవ్వకం చాలా మందికి ఆదాయ వనరుగా ఉంది. ఈ గనులలో తరచుగా పెద్ద కంపెనీలలో ఉండే భద్రతా చర్యలు ఉండవు. చాలా సందర్భాలలో కార్మికులు సాధారణ పనిముట్లతో తవ్వుతారు. సొరంగానికి సరైన పటిష్టత లేకపోతే మట్టి, రాళ్ళు అకస్మాత్తుగా కూలిపోవచ్చు.
[ 🇨🇫 RÉPUBLIQUE CENTRAFRICAINE ]
🔸 Plus de 100 personnes ont été tuées dans l’effondrement d’une mine d’or à Zamboye.
pic.twitter.com/fVUjQ05QKl— Little Think Tank (@L_ThinkTank) August 20, 2026
తాజావార్తలు
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?