ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో కాస్త శాంతించినా అమెరికాలో కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగిపోతున్న నేపథ్యంలో అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలోని 22 దేశాలకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించింది. 80కి పైగా దేశాలను వెరీ హై రిస్క్ జోన్ దేశాల జాబితాలో సీడీసీ చేర్చింది. కాగా మరో 22 దేశాలను హైరిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. లెవల్ 4 దేశాల జాబితాలో ఉంచిన దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించవద్దని ప్రజలను హెచ్చరించింది.
Read: ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక: ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదు…
ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఖతార్, బహ్రెయిన్, ఫ్రాన్స్, కెనడా, అరెజ్జింటీనా, టర్కీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, బ్రిటన్, ఉరుగ్వే, పనామా తదితర దేశాలను కొత్తగా జాబితాలో చేర్చింది. దీంతో మొత్తం 102 దేశాలను అమెరికా హైరిస్క్ దేశాల జాబితాలో ఉంచింది. దేశ ప్రజలందరూ కొవిడ్ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని అమెరికా సూచించింది. అమెరికాలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
